74 మంది ఐఎస్ఐఎస్ తీవ్రాదులు హతం

- October 24, 2016 , by Maagulf
74 మంది ఐఎస్ఐఎస్ తీవ్రాదులు హతం

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా ఉగ్రవాదుల భరతం పట్టారు. సంకీర్ణ దళాలు చేపట్టిన ఆపరేషన్ లో మొత్తం 74 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతను ఇరాక్ సేనలు ప్రాణాలతో పట్టుకున్నాయి.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిర్కుక్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలం నుంచి ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి ఇకాక్ సేనలు దాడులు చేస్తున్నాయి. 74 మంది జీహాదీలను అంతం చేశామని, దాడులు ముగిశాయని, జనజీవనం మళ్లీ సాదారణ స్థితికి చేరుకుందని కిర్కుక్ ప్రావిన్స్ గవర్నర్ నజ్మెద్దీన్ కరీమ్ తెలిపారు.
ఇస్లామిక్ స్టేట్ జీహాదీలను అంతం చెయ్యడమే కాకుండా ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ ను ప్రాణాలతో పట్టుకుని విచారిస్తున్నామని ఆయన వివరించారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు గట్టిపట్టు ఉన్న కిర్కుక్ నగరం స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్ సేనలు గత కొంత కాలం నుంచి దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు ఉగ్రవాదులు పారిపోగా కొందరు తమను తాము పేల్చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com