ఒమన్ పార్క్ లో వదిలివేయబడిన నవజాత పసిపాప

- October 26, 2016 , by Maagulf
ఒమన్ పార్క్ లో వదిలివేయబడిన  నవజాత పసిపాప

మస్కట్ : కన్నవారు కర్కశంగా వదలిపెట్టిన నవజాత శిశువు సోమవారం ఉదయం అమెరిట్ పార్క్ సమీపంలో రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ద్వారా కనుగొనబడింది.గస్తీ దళం ఉదయం  6:30 గంటల సమయంలో ఈ పసిగుడ్డు వారికి లభ్యం కాబడింది. ఆ  శిశువుని   ఒక దుప్పటి లో చుట్టి అక్కడ విడిచిపెట్టారు. బొడ్డు తాడు కూడా సరిగా కత్తిరించబడని స్థితిలో ఉన్న ఆ పసిపాపను ఖోయూల  ఆస్పత్రిలో చేర్పించినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కేవలం రెండు రోజుల క్రితమే ఆ శిశువు జన్మించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక టవల్ చుట్టి కంకర రోడ్డు మార్గంలో నిర్దయగా విడిచి  వెళ్ళిపోయారు. అంబులెన్స్ సిబ్బంది ఆ పసిగుడ్డుకు  ప్రథమ చికిత్స జరిపి ఖోయూల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉన్న ప్రతినిధి మాట్లాడుతూ, శిశువు యొక్క ఆరోగ్య పరిస్థితి ఎంతో క్షీణించింది.సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నుండి ఒక అధికారిక విభాగం  ఆ శిశువు యొక్క ఆరోగ్య పర్యవేక్షణ, పర్యవేక్షిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com