ఫ్రీ ట్రాన్సిట్ వీసా ఆన్ అరైవల్ అతి త్వరలో
- October 26, 2016
కొత్త ట్రాన్సిట్ వీసా స్కీమ్‌ని అతి త్వరలో అమలు చేయనున్నట్లు ఖార్ టూరిజమ్ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్కీమ్ అమల్లోకి వస్తే అన్ని దేశాలకు చెందిన ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణీకులు ఎలాంటి రుసుమూ లేకుండా ట్రాన్సిట్ వీసా పొందే అవకాశం ఉంటుంది. దోహా ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు ఖతార్ ఎయిర్వేస్ ద్వారా టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని క్యుటిఎ వర్గాలు వెల్లడించాయి. 38 దేశాలకు చెందదినవారు వీసా ఆన్ అరైవల్‌కి అర్హులు. 100 ఖతారీ రియాల్స్ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చెల్లించి, దాన్ని పొందవచ్చు. అండోరా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, బెలారస్, బెల్జియమ్, బ్రూనై, కెనడా, సిప్రస్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హాంగ్‌కాంగ్, హంగేరీ, ఐస్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, స్వీడన్, స్పెయిన్, సౌత్ కొరియా, సింగపూర్, తదితర దేశాలు ఇందులో ఉన్నాయి. క్రూయిజ్ ప్యాసింజర్ల కోసం కూడా క్యుటిఎ అనేక కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అక్టోబర్ 31న లజ్మారా అనే కొత్త క్రూయిజ్ షిప్‌ని రంగంలోకి దించుతున్నారు. అక్టోబర్ 25న దుబాయ్ నుంచి ప్రారంభమైంది ఈ క్రూయిజ్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







