ఆఫ్ఘనిస్థాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు
- October 26, 2016
: ఆఫ్ఘనిస్థాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సెంట్రల్ అఫ్గాన్ ప్రావిన్స్ గోహోర్లో ఉగ్రవాదులు సుమారు 30 మంది పౌరులను అపహరించి అనంతరం వారిని హత్య చేశారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రావిన్షియల్ క్యాపిటల్ ఫిరోజ్ కోహ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిన్న స్థానిక ఐఎస్ కమాండర్‌ను హతమార్చినందుకు ఐఎస్ ప్రతీకారంగా పౌరులను చంపేసిందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
నిన్న భద్రతా సిబ్బంది స్థానికుల సహాయంతో స్థానిక ఐఎస్ కమాండర్నుహతమార్చారు. దీంతో వెంటనే నిన్న రాత్రే ఐఎస్ ఉగ్రవాదులు 30 మంది గ్రామస్థులను అపహరించారు.
వారిలో ఎక్కువ మంది గొర్రెల కాపరులు. వారి మృతదేహాలను స్థానికులు ఈరోజు ఉదయం గుర్తించారు. అయితే వీరి హత్యలకు ఐఎస్ అధికారికంగా బాధ్యత వహించలేదు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణంగా అరాచకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం కాబూల్‌లో ఉగ్రవాదులు దాడి చేయడంతో సుమారు 80 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









