దీపావళికి బోనస్ రూపంలో ఈ ఖరీదైన నజరానా....
- October 28, 2016
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. గుజరాత్..సూరత్‌లోని డైమండ్ మర్చంట్ సావ్ జీ ధోలాకియా సంస్థలో పని చేసే సిబ్బంది ఎగిరి గంతేస్తారు. ఈ పండుగకు బోనస్ గా ఈ వ్యాపారి... వారికి ఈసారి వెయ్యికి పైగా కొత్త కార్లు, 400 ప్లాట్లు కానుకగా అందజేయనున్నారు. హరేకృష్ణ ఎక్స్ పోర్ట్స్ ఓనర్ అయిన సావ్ జీ.. తమ సంస్థలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారికి ఈ నజరానాలు అందజేయనున్నారు.ఈ సంవత్సరం 1716 మంది ఉద్యోగులను బెస్ట్ ఎంప్లాయీస్ గా గుర్తించినట్టు ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం ఇలా ఆయన దీపావళికి బోనస్ రూపంలో ఈ ఖరీదైన నజరానాలను అందజేస్తున్నారు. ఇప్పటికే కార్లు ఉండి..సొంత అపార్ట్ మెంట్లు లేనివారికి అపార్ట్ మెంట్లను, ఫ్లాట్లు ఉండి కార్లు లేనివారికి కార్లను ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.1100 చదరపు అడుగుల ఫ్లాట్ ఒక్కొక్కటి 15 లక్షలు ఖరీదు చేస్తుందని, అయిదేళ్ళ తరువాత ఉద్యోగులు నెలకు 11 వేలు చెల్లిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. గత ఏడాది ఈ సంస్థ తమ సిబ్బందికి 491 కార్లను, 200 ఫ్లాట్లను అందజేసింది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







