మృతదేహాల తరలింపుకు చర్యలు ముమ్మరం చేసిన అబుధాబి
- October 28, 2016
అబుదాబిలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పూర్తి సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. త్వరితగతిన మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఘటన నాటి నుంచి తమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఈనెల 19న అబుదాబిలోని రీమ్ ఐలాండ్‌లో ఉన్న లేబర్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 16 గదులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. వలస కార్మికులు గాఢనిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్ఫ్ డూన్స్ లాండ్ స్కేపింగ్ అండ్ అగ్రికల్చర్ సర్వీసెస్ కంపెనీలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు వలస కార్మికులు ఈ ఘటనలో మృతిచెందారు.
మరణించిన వారిని రాకేష్, పిట్ల నరేష్, ప్రకాశ్ మలావత్, ముచ్చిండ్ల నరేష్, గాండ్ల అభిలేష్గా గుర్తించారు. మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
శేఖర్ మల్యాల(అబుధాబి)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







