మృతదేహాల తరలింపుకు చర్యలు ముమ్మరం చేసిన అబుధాబి

- October 28, 2016 , by Maagulf
మృతదేహాల తరలింపుకు చర్యలు ముమ్మరం చేసిన అబుధాబి

అబుదాబిలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పూర్తి సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. త్వరితగతిన మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ సూచించారు. ఘటన నాటి నుంచి తమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఈనెల 19న అబుదాబిలోని రీమ్‌ ఐలాండ్‌లో ఉన్న లేబర్‌ క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 16 గదులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. వలస కార్మికులు గాఢనిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్ఫ్‌ డూన్స్‌ లాండ్‌ స్కేపింగ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ సర్వీసెస్‌ కంపెనీలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు వలస కార్మికులు ఈ ఘటనలో మృతిచెందారు.
మరణించిన వారిని రాకేష్‌, పిట్ల నరేష్‌, ప్రకాశ్‌ మలావత్‌, ముచ్చిండ్ల నరేష్‌, గాండ్ల అభిలేష్‌గా గుర్తించారు. మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

శేఖర్ మల్యాల(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com