టూరిస్టుల కోసం రెంట్ ఎ బైక్ ఫెసిలిటీ
- October 29, 2016
అప్పట్లో టౌనుకెళ్తే.. అవసరాలకు తిరగడానికి అద్దె సైకిళ్లుండేవి.. రూపాయిచ్చి.. పనులన్నీ చూసుకున్నాక.. తిరిగి దాన్ని ఇచ్చేసి బస్సెక్కేసేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇంటికో బైక్ ఉంది. అనుకోవడమే ఆలస్యం.. నిమిషాల్లో ఎక్కడికైనా దూసుకెళ్లిపోవచ్చు. కానీ ఇది లోకల్ వరకే. ఎక్కడికైనా టూర్లు వెళ్తే మాత్రం ఆటోలు, ట్యాక్సీలు పట్టుకోవాల్సిందే. విశాఖ వచ్చే టూరిస్టులకు ఆ కష్టాలు దూరం చేస్తామంటున్నారు నగరవాసులు. అద్దెకు బైక్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌కు తెరతీశారు.
విశాల సాగరతీరం, చుట్టూ అడవులు, కొండలు.. అంత అందంగా ఉంటుంది కాబట్టే దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది విశాఖ. అందుకే దేశ, విదేశీ పర్యాటకులతో సిటీ ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. కానీ వెళ్లాల్సిన చోటుకు వెళ్లాలంటే సమయానికి క్యాబ్ లు, ట్యాక్సీలు దొరకడం కష్టం. దీనికి తోడు సిటీ ట్రాఫిక్ టూరిస్టులకు చుక్కలు చూపిస్తుంది. దీనికి పరిష్కారం ఆలోచించారు విశాఖ యువకులు. టూరిస్టులకు టూ వీలర్ అద్దెకిచ్చే సరికొత్త సౌకర్యాన్ని స్టార్ట్ చేశారు.
కొత్త ప్రాంతమే అయినా ఒక బైక్ మన దగ్గర ఉంటే సిటీలో దూసుకెళ్లిపోవచ్చు. ఆ ఆలోచనే నగర యువతలో అద్దె బైక్ ఆలోచనకు బీజం పడేలా చేసింది. కానీ సిటీకి వచ్చే ముక్కూ మొహం తెలీని వారికి అద్దెకు బైక్ ఎలా ఇస్తారు అనేగా మీ డౌట్. ఆ సందేహాలే అవసరం లేదు. బైక్ తీసుకోడానికి మీకు విశాఖలో ఎవరూ తెలిసుండాల్సిన పనిలేదు. ప్రాసెస్ చాలా సింపుల్. సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఓ యవకుడి అద్దెకు బైక్ తీసుకోవడంలో ఎదురైన ఇబ్బందులే అతడు జాగో రైడర్స్ సంస్థను ప్రారంభించడానికి కారణమైంది.
దేశంలోని చాలా నగరాల్లో అద్దెకు బైకిచ్చే కాన్సెప్ట్ ఉంది. కానీ ఆ బైక్ తీసుకోవాలంటే బ్యాంక్ లోన్ రేంజిలో ఉండేది.. అతడి గురించి ఎంక్వైరీలు చేసి, ఎనాలసిస్ లు పూర్తి చేస్తారు. బైకు ధరను బట్టి వేలకు వేలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుంటారు. అంతా అయ్యాక ఇచ్చే బైకు అద్దె కూడా సామాన్యుల తీసుకునే రేంజిలో ఉండదు. విశాఖ వచ్చే పర్యాటకులకు అలాంటి కష్టాలేవీ లేకుండా చేసింది జాగో రైడర్స్. బైక్ కోరుకోవడమే ఆలస్యం.. నిమిషాల్లో కావల్సిన చోటుకు దూసుకెళ్లేలా చేస్తోంది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









