భారతీయుడి కోసం ఒబామా ప్రచారం...
- October 30, 2016
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మిత్రుడైన ప్రవాస భారతీయుడికోసం అత్యంత అరుదుగా టీవీ యాడ్‌లో దర్శనమిచ్చారు.చికాగో శివార్లలోని ఇల్లినాయిస్ జిల్లానుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీచేస్తున్న తన 'ఆప్తమిత్రుడు' రాజా కృష్ణమూర్తిని గెలిపించాలని ఒబామా ఈ యాడ్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'హాయ్, నేను బరాక్ ఒబామాను. పార్లమెంట్ సభ్యుడిగా పోటీచేస్తున్న నా మిత్రుడు కృష్ణమూర్తికి ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను' అని ఆయన 30 సెకన్ల నిడివి గల ఈ స్వల్ప వీడియో యాడ్‌లో పేర్కొన్నారు. కృష్ణమూర్తి తనకు 'మంచి మిత్రుడు' అని, అమెరికా ఆర్థిక వ్యవస్థను అందరికీ సంక్షేమకరమైనదిగా తీర్చిదిద్దడం ఎలా?అని ఆలోచిస్తున్న తనకు కృష్ణమూర్తి ఎంతో విలువైన సలహాలు, సూచనలు అందించారని ఒబామా ఈ యాడ్‌ద్వారా ప్రజలకు వివరించారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









