బహ్రెయిన్ ఎకానమీకి 'ఫ్లెక్సిబుల్ వర్క్ పర్మిట్స్' ఊతం
- October 30, 2016
బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు 'ఫ్లెక్సిబుల్ వర్క్ పర్మిట్స్' ఊతమిస్తాయని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎమ్ఆర్ఎ) సిఇఓ ఔస్మా అల్ అబ్సి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. టెంపరరీ ఎంప్లాయ్మెంట్ విధానం ద్వారా ఉద్యోగులకు అలాగే, సంస్థలకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన చెప్పారు. లేబర్ మార్కెట్లో మార్పులకు, సవాళ్ళకు బహ్రెయిన్ సిద్ధంగా ఉందని, బహ్రెయిన్ ఎకానమీ ఈ తాజా విధానంతో పరుగులు పెట్టడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. అల్ అబ్సి ఇంకా మాట్లాడుతూ, కార్మికులే స్పాన్సర్షిప్, ఎంప్లాయ్మెంట్, హెల్త్‌కేర్ మరియు ఇన్సూరెన్స్ పీజు చెల్లించుకోవాలనీ, అదే సమయంలో ఒకేసారి మల్టిపుల్ ఎంప్లాయర్స్‌తో పనిచేయవచ్చని వివరించారు. 200 బహ్రెయినీ దినార్లు ఇస్యూయెన్స్ ఫీజును, హెల్త్ కేర్ ఫీజు 144 బహ్రెయిన్ దినార్స్నీ, నెలవారీ సోషల్ ఇన్స్యూరెన్స్ 30 బహ్రెయినీ దినార్స్నీ తామంతట తామే భరించాల్సి ఉంటుందని తెలిపారాయన. ప్రతి నెల 2,000 మందికి ఈ పర్మిట్స్ ఇవ్వాలని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. కొత్త పర్మిట్స్ విధి విధానాలపై అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించాలనుకుంటున్నట్లు అల్ అబ్సి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







