ఈజిప్ట్ వరదల్లో చిక్కుకుని 22 మంది మృతి

- October 31, 2016 , by Maagulf
ఈజిప్ట్ వరదల్లో చిక్కుకుని 22 మంది మృతి

ఈజిప్టులో ఇటీవల సంభవించిన వరదల్లో 22 మంది మృతి చెందగా 72 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆదేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగు ప్రావిన్సులను వరదలు అతలాకుతలం చేసినట్టు హోంమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖాలెద్ మెఘాహెద్ తెలిపారు. గతవారం కుదిపేసిన ఈ వరదల దాటికి దక్షిణ సినాయ్, ఎర్ర సముద్రం, సోహాగ్, బని సూయెఫ్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆయన పేర్కొన్నారు. వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులైనట్టు వివరించారు. రాజ్ ఘరెబ్ నగరంలో వందలాది కార్లు కొట్టుకుపోయినట్టు తెలిపారు. సహాయకార్యక్రమాల కోసం మిలటరీని రంగంలోకి దించినట్టు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com