దీపావళికి సందడి చేసిన 'మెగా ఫ్యామిలీ'
- October 31, 2016
దీపావళికి 'మెగా' హీరోలందరూ ఒక చోట కలిశారు.. వారంత కలసి తీసుకున్న ఫొటో పోజ్ అదిరిపోయింది. దీపావళి పండగ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి సహా ఆ కుటుంబంలోని హీరోలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోకు మాంచి పోజొకటి ఇచ్చారు. మెగాస్టార్ కు అటు ఇటు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూర్చున్నారు. వరుణ్ తేజ్ పక్కన బన్నీ, సాయిధరమ్ తేజ్ పక్కన నాగేంద్రబాబు,ఆయన కూతురు నీహారిక నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. బన్నీ వెనుక అల్లు శిరీష్, వరుణ్ తేజ్ భుజంపై చేయి వేసిన చిరు తనయుడు రామ్ చరణ్ నిలబడి ఉన్నారు. ఈ ఫొటోను మెగాస్టార్ 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ట్విట్టర్ ఖాతా ద్వారా రామ్ చరణ్ 'మెగా' అభిమానులతో పంచుకున్నాడు.
'అన్నయ్య కుటుంబం 'మెగా కింగ్ డమ్' మెగా వారసులు..మెగా ఫ్యామిలీ' అంటూ ఆ ట్వీట్ లో రామ్ చరణ్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







