మంచి మెసేజ్ ఉన్న సినిమా ' హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'
- November 01, 2016
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. ఆర్.నారాయణమూర్తి, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదలవాడ పద్మావతి నిర్మాత. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా లోకేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. చదలవాడ శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది. అసలు దేశంలో ప్రజల సమస్యలకు కారణమైన నల్లధనానికి మూలమేంటి? ఓ సాధారణ హెడ్ కానిస్టేబుట్ కుటుంబం, నల్లధనం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది, ఎలా విచ్చిన్నమైంది. దానికి ఆ హెడ్ కానిస్టేబుల్ ఏం చేశాడనేదే ఈ సినిమా కథ.
మానవీయ విలువలుపై ఆర్ధిక విలువలు ఎలాంటి ఆధిపత్యాన్ని కనపరుస్తున్నాయి. రాజకీయాలను డబ్బు శాసిస్తుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల నుండి ప్రజల ను రక్షించేదెలా అనే సందేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..బ్లాక్ మనీ వల్ల దేశమెంతో వెనుకబడిపోతుంది. బ్లాక్ మనీ వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయనే దాన్ని సినిమాలో చూపిస్తున్నాం. అలాగే బ్లాక్మనీ సమస్యను రూపుమాపి ఓ హెడ్ కానిస్టేబుల్ సమాజాన్ని ముందుకు ఎలా నడిపాడనేదే చూపిస్తున్నాం. 60 రోజుల పాటు సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.డిసెంబర్ 15లోపు చిత్రీకరణను పూర్తి చేసి జనవరిలో సినిమాను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ.. మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆర్.నారాయణమూర్తి మా మనిషి.మా సంస్థలో జయసుధ చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టి.ప్రసన్నకుమార్, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







