ఘోర అగ్నిప్రమాదం : న్యూఢిల్లీ

- November 01, 2016 , by Maagulf
ఘోర అగ్నిప్రమాదం : న్యూఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాదారా ప్రాంతంలోని మోహన్‌ పార్క్‌ ఏరియాలోని ఓ భవనంలో మంటలు చెలరేగి నలుగురు మృతి చెందారు.నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించడంతో వారు అలాగే సజీవదహనహయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు.భవనంలో చిక్కుకుని స్పృహకోల్పోయిన వారిని సిబ్బంది రక్షించారు. భవనంలోని చిన్న పిల్లలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com