థాను ను అరెస్టు చేయమని కోర్టు ఉత్తర్వులు జారీ..

- November 01, 2016 , by Maagulf
థాను ను అరెస్టు చేయమని కోర్టు ఉత్తర్వులు జారీ..

కోర్టు ఉత్తర్వు ప్రకారం అప్పు తిరిగి చెల్లించని ప్రముఖ సినీ నిర్మాత కళైపులి ఎస్‌. థానును ఈనెల 28లోగా అరెస్టు చేయమంటూ నాగర్‌కోవిల్‌ కోర్టు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. థాను రజనీ నటించిన కబాలి సనిమాకు నిర్మాతని తెలిసిన విషయమే. నాగర్‌కోవిల్‌లోని న్యూ థియేటర్‌ యజమాని డేవిడ్‌ వద్ద సినీ నిర్మాత కళైపులి ఎస్‌. థాను రూ.2 లక్షలను రుణంగా తీసుకున్నాడు. సకాలంలో రుణాన్ని చెల్లించకపోవడంతో డేవిడ్‌ నాగర్‌కోవిల్‌ కోర్టును ఆశ్రయించాడు. 2013లో ఆ కోర్టు విచారణ జరిపి వడ్డీతో సహా రూ.2లక్షలను డేవిడ్‌కు నిర్మాత ఎస్‌. థాను చెల్లించాలని ఆదేశించింది. అయితే థాను మూడేళ్లు దాటిని కోర్టు ఉత్తర్వుల ప్రకారం డేవిడ్‌కు రుణాన్ని తిరిగి చెల్లించలేదు.
దీనితో డేవిడ్‌ మళ్లీ నాగర్‌కోవిల్‌ కోర్టును ఆశ్రయించగా ఈ నెల 28వ తేదీలోగా థాను అరెస్టుచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com