విడుదలకు సిద్ధముగా ఉన్న 'కేటుగాడు'

- August 25, 2015 , by Maagulf
విడుదలకు సిద్ధముగా ఉన్న 'కేటుగాడు'

ఉలవచారు బిర్యాని' చిత్రంలో హీరోగా నటించి మెప్పించిన యంగ్ హీరో తేజస్ కంచర్ల హీరోగా ప్రముఖ రచయిత వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో వెంకటేష్‌ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'కేటుగాడు'. కిట్టు నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వెంకటేష్‌ బాలసాని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఆడియో మంచి సక్సెస్ సాధించింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకుంది. ఫ్యామిలీ మెంబర్స్‌ తర్వాత నేను హీరోగా ఇక్కడ నిలబడటానికి కారణమైన కె.యస్.రామారావుగారు, ప్రకాష్ రాజ్ గారు ఇద్దరూ ఈ సినిమాని చూసి, చాలా బావుందని, చాలా బాగా నటించానని మెచ్చుకోవడం చాలా హ్యపీగా అనిపించింది. అంతే కాకుండా సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. సాయికార్తీక్ గారు అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. ఆడియో పెద్ద హిట్టయింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది. వెంకటేష్ గారి లాంటి నిర్మాత వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఉలవచారు బిర్యాని తర్వాతే నేను హీరోగా చేసిన ఈ సినిమా విడుదలవుతుంటే చాలా ఎగ్జయిట్ గా ఉంది. సినిమాని వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని హీరో తేజస్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com