అమ్నెస్టీ తర్వాత కఠిన చర్యలు తప్పవు

- November 03, 2016 , by Maagulf
అమ్నెస్టీ తర్వాత కఠిన చర్యలు తప్పవు



మూడు నెలల అమ్నెస్టీ ముగిసిన తర్వాత అక్రమంగా నివసిస్తున్నవారిపై సెర్చ్‌ అండ్‌ ఫాలో అప్‌ డిపార్ట్‌మెంట్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ కఠిన చర్యలు తీసుకోనుంది. సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. సెర్చ్‌ అండ్‌ ఫాలో అప్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ అబ్దుల్లా జబెర్‌ లెబ్దా మాట్లాడుతూ, అమ్నెస్టీని చాలామంది ఆశ్రయించారనీ, గ్రేస్‌ పీరియడ్‌లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోనివారిపై కఠినచర్యలు ఉంటాయని అన్నారు. అమ్నెస్టీ ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో ఇన్‌స్పెక్షన్‌ కార్యక్రమం ఉంటుందని తెలిపారాయన. డిసెంబర్‌ 1తో అమ్నెస్టీ పీరియడ్‌ ముగియనుంది. అమ్నెస్టీని పొడిగించే అవకాశం ప్రస్తుతానికి అయితే లేదనీ, ప్రస్తుతం కేటాయించిన సమయం సరిపోతుందని బ్రిగేడియర్‌ లెబ్దా అభిప్రాయపడ్డారు. ఎయిర్‌ టికెట్‌ విషయంలో ఇబ్బందులేమైనా తలెత్తితే, అలాంటివారిని మానవీయ కోణంలో ఆదుకునేందుకు డిపార్ట్‌మెంట్‌ ముందుకు వస్తుందని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com