రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును తిరస్కరించారు.
- November 03, 2016
టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ జర్నలిస్టు అక్షయా ముఖుల్, ప్రధాని నరేంద్రమోదీ నుంచి స్వీకరించే రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును తిరస్కరించారు. ముఖుల్ అవార్డుల ప్రధానోత్సవం నుంచి బాయ్ కాట్ చేశారు. ఆయన తరుఫున హార్పర్ కాలిన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్, పబ్లిషర్ క్రిష్ణ చోప్రా ఈ అవార్డును అందుకున్నారు. తనకు ఈ అవార్డు దక్కడం చాలా గౌరవంగా ఉందని, కానీ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం ఇష్టంలేక కార్యక్రమం నుంచి వెళ్లిపోయానని ముఖుల్ తెలిపారు. కాల్పనికేతర పుస్తక కేటగిరీలో గీతా ప్రెస్, ది మేకింగ్ ఆఫ్ హిందూ ఇండియాకు ఈ అవార్డు దక్కింది. వివిధ మూలాల నుంచి ఈ బుక్ విమర్శకుల ప్రశంసలను ఈ బుక్ అందుకుంది.భారతదేశ హిందుత్వ సిద్ధాంతకర్తల్లో జాతీయ, తీవ్రవాద చరిత్రను ఈ బుక్ లో వివరించారు. 2015 ఆగస్టులో ఈ బుక్ విడుదలైంది. విడుదల అనంతరం బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, అట్టా గలాట్టా-బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్ బుక్ ఫ్రైజ్ లను కూడా ఈ బుక్ సొంతంచేసుకుంది. మోదీ ఆలోచనలతో తాను జీవిస్తున్నట్టు ఒకే ఫ్రేమ్ లో నిల్చొని, నవ్వుతూ అవార్డు స్వీకరించడం ఇష్టలేదని అందుకే కార్యక్రమం నుంచి బాయ్ కాట్ చేసినట్టు తెలిపారు. బుధవారం జరిగిన ఈ ప్రధానోత్సవంలో అవార్డు గ్రహితలందరికీ మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా రామ్ నాథ్ గోయెంకాకు నివాళులర్పించారు. స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో వార్తాపత్రికల కృషిని ఆయన గుర్తుచేసుకున్నారు. అనంతరం టెక్నాలజీ మీడియాకు ఒక సవాలుగా మారిందని, అప్పట్లో వార్తలు అందించడానికి 24 గంటల్లో పట్టే సమయం, ఇప్పుడు 24 నిమిషాల్లో ప్రజల ముందు ఉంటుందని మోదీ కొనియాడారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







