కొత్త భీమా పధకాన్ని ప్రవేశ పెట్టనున్న రైల్వే సంస్థ
- November 03, 2016
రైలు ప్రయాణికులకు 92 పైసలకే ప్రమాద బీమా అందిస్తున్న ఐఆర్సీటీసీ ఇప్పుడు మరో బీమా పథకం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. రైలు ప్రయాణికుల వద్ద ఉన్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు వంటి గాడ్జెట్స్‌కు బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఐఆర్సీటీసీ అధికారులు, బీమా అధికారులకు మధ్య తొలి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో తప్పుడు దావాలపై బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయని, తాము వారితో తమ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకున్నామని ఐఆర్సీటీసీ చైర్మన్, ఎండీ ఏకే మనోచా గురువారమిక్కడ తెలిపారు. తొలి దశలో ఈ బీమా సౌకర్యాన్ని క్రెడిట్ కార్డు వినియోగదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించాలని ఐఆర్సీటీసీ భావిస్తోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







