'దువ్వాడ జగన్నాథమ్‌'రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు..

- November 04, 2016 , by Maagulf
'దువ్వాడ జగన్నాథమ్‌'రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు..

స్టెలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మళ్ళీ యాక్షన్ లోకిదిగాడు. సైరనోడు తర్వాత మళ్ళీ మేకప్ వేసుకోలేదు బన్నీ. రెండు సినిమాలు ప్రారంభమయ్యాయి గానీ షూటింగ్ మొదలుపెటలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చింది. 'దువ్వాడ జగన్నాథమ్‌'రెగ్యులర్‌ షూటింగ్‌ లో ఈ రోజు నుండి పాల్గొంటున్నాడు బన్నీ. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు బన్నీ.హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్దే కథానాయికగా నటుస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.మరో వైపు తమిళ దర్శకుడు లింగుస్వామీతో చిత్రాన్ని కూడా ఇటివలే ప్రారంభించాడు .ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ కావచ్చు. తమిళ్ తెలుగు భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com