ముగ్గురు మొనగాళ్లు 'చిరు' మూవీ రిమేక్...

- November 04, 2016 , by Maagulf
ముగ్గురు మొనగాళ్లు 'చిరు' మూవీ రిమేక్...

కొరిమో గ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ లారెన్స్ చిరంజీవి మూవీపై కన్నేశాడు. మల్టీటాలెంటెడ్ పర్సన్ మెగాస్టార్ మూవీని రిమేక్ చేయబోతున్నాడట. ఇంతకీ లారెన్స్ రిమేక్ చేస్తున్న చిరంజీవి మూవీ ఏంటో మీరు ఓ లుక్కెయండి.
'గంగ'తో భారీ హిట్టు స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా డైరెక్టర్ గా కూడా సత్తా చూపిస్తున్నాడు. ముని సీరిస్ లైన కంచన, గంగ సినిమాలతో ఈ లారెన్స్ ఇటు నటుడిగా, డైరెక్టర్ తన టాలెంట్ చూపించాడు. గంగ సినిమాతో భారీ హిట్టు కొట్టిన మల్టీటాలెంటెడ్ ఇప్పుడు చిరంజీవి మూవీనే రిమేక్ చేయబోతుండడం విశేషంగా మారింది.ముగ్గురు మొనగాళ్లు.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మూవీస్ లో ముగ్గురు మొనగాళ్లు ఒకటి.చిరు త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయమే సాధించింది. ఇందులోని మూడు క్యారెక్టర్లలో చిరు చూపించిన వైవిధ్యం.. ఆయన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా మెగా అభిమానుల్ని ఉర్రూతలూగించింది. ఈ సినిమాను ఇప్పుడు లారెన్స్ రీమేక్ చేయబోతున్నాడట. మూడు రకాల పాత్రల్లో లారెన్స్ ముగ్గరు మొనగాళ్లు సినిమా నిజానికి రజనీకాంత్ హీరోగా చేసిన మూండ్రు ముగమ్ కి రిమేక్ గా తెరకెక్కింది. ఇప్పుడు ఇదే చిత్రం రిమేక్ లో లారెన్స్ సైతం మూడు క్యారెక్టర్స్ లో తన మల్టీటాలెంట్ ని మరోసారి చూపించాలని ఆశపడుతున్నాడట. ఈ చిత్రానికి నిర్మాత కూడా లారెన్సేనట. అయితే దర్శకత్వ బాధ్యతలు మాత్రం వేరే దర్శకుడికి అప్పగిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాని ఇప్పటి జనరేషన్ కి తగ్గట్లగా డీల్ చేసే దర్శకుడి కోసం లారెన్స్ సర్చ్ చేస్తున్నాడట. గంగలో రెండు రకాల పాత్రలతో అదరగొట్టిన లారెన్స్ ఈ ముగ్గరు మొనగాళ్లు రిమేక్ లో మూడు రకాల పాత్రలతో అదుర్స్ అనిపిస్తాడేమో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com