సంక్రాంతికి ఇద్దరు బడా హీరోలు .. ..
- November 05, 2016
సంక్రాంతికి ఇద్దరు బడా హీరోలు .. తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఒకరు మెగా హీరో అయితే .. మరోకరు నందమూరి హీరో. అంతేనా .. మరో స్పెషాలిటీ కూడా ఉంది. చిరంజీవికి ఇది 150వ సినిమా .. బాలయ్యకు ఇది 100వ సినిమా . వీరద్దరూ వచ్చే సంక్రాంతికి సందడి చేయనున్నారు. ఖైదీ నం 150 సినిమా.. బాలయ్య గౌతమీపుత్రశాతకర్ణి సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయి. అసలే ఇప్పటికే టాలీవుడ్ లో రికార్డుల రచ్చ జరగుతోంది. ఇలాంటి సమయంలో వీరి సినిమాలంటే ..అది సంక్రాంతికి అయితే ఆ సందడే వేరు .అయితే సంక్రాంతి పోటీ ఈ ఇద్దరి హీరోలకు కొత్తేమీ కాదు. 2001 సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య , చిరంజీవి పోటీపడ్డారు. ఆ ఏడాది నరసింహనాయుడు , మృగరాజు కాగా ..బాలయ్య మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిల్చింది. ఖైదీనెం 150 మూవీ బృందం తొలుత మూవీని జనవరి 13 రిలీజ్ చేయాలని భావించినా .. ఆతర్వాత ఆ డేట్ ను 11కి షిఫ్ట్ చేశారు. దీంతో బాలకృష్ణ మూవీ కూడా ఆదే రోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం . ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి.. టాలీవుడ్ స్టార్ హీరోలంతా పోటీ పడటం కామనే. కానీ.. ఈసారి సంక్రాంతికి మాత్రం.. సినీ రేస్ చాలా ఇంట్రస్టింగ్ మారింది.. మేజర్‌గా ఈ పోటీలో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150తో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ట.. తన ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతిమిపుత్ర శాతకర్ణితో పోటీ పడబోతున్నాడు. వీరిద్దరితో పాటు విక్టరీ వెంకటేష్ గురు సినిమా కూడా సంక్రాంతికే రానుందని టీ టౌన్లో టాక్ నడుస్తోంది.మరో సీనియర్ హీరో.. విక్టరీ వెంకటేష్.. రీమేక్ మూవీ గురుతో సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. హిందీ, తమిళ్లో రూపొందిన సాలా కడూస్ సినిమాకి.. గురు రీమేక్. క్రీడల్లో రాజకీయాల కారణంగా కెరీర్ కోల్పోయిన ఓ యువకుడు, స్లమ్ ఏరియాలోని ఓ అమ్మాయిని పట్టుదలతో ఇంటర్నేషనల్ బాక్సర్‌గా నిలబెట్టేదే.. సినిమా స్టోరీ. ఈ మూవీలో.. వెంకీ బాక్సింగ్ కోచ్ రోల్లో కనిపించనున్నాడు. కొంగర ప్రసాద్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్, దివాళీ పోస్టర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. బాక్సింగ్ కోచ్‌గా వెంకీ మాస్ లుక్‌తో అదిరిపోయాడు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







