డ్రైవర్ లెస్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్లో అపశృతి ..
- November 05, 2016
దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టనున్న డ్రైవర్ లెస్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్లో అపశృతి చోటు చేసుకుంది. కాళిందీ కుంజ్ డిపోలోని మజెంతా లైన్లో శుక్రవారం ట్రయల్ నిర్వహిస్తుండగా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చి ఒక్కసారిగా ఢీకొన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం ఉన్న కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెప్పారు. డ్రైవర్ రహిత మెట్రో రైళ్లను నడిపేందుకే దిల్లీలో ప్రత్యేకంగా మజెంటా లైన్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి దీనిపై ట్రయల్ రన్ నిర్వహించగా శుక్రవారం జరిగిన ట్రయల్ రన్లో ఈ ప్రమాదం చోటు చేసకుంది.ప్రమాదంలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. హ్యుందయ్ మోటార్ గ్రూప్‌కి చెందిన హ్యుందయ్ రోటెమ్ సంస్థ ఈ డ్రైవర్‌లెస్ మెట్రో రైల్ పనులు చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







