శ్రామికుల భద్రతపై ఒమాన్ కఠిన నియమాలు

- August 26, 2015 , by Maagulf
శ్రామికుల భద్రతపై ఒమాన్ కఠిన నియమాలు

భవన నిర్మాణ ప్రదేశాల వద్ద సంభవిస్తున్న వరుస ప్రమాదాల పేపధ్యంలో, శ్రామికుల  భద్రతా ప్రమాణాలను పాటించని లేదా అతిక్రమించే కంపెనీలపై జరిమాన విధించక తప్పదని, మానవ వనరుల శాఖ వారు స్పష్టం చేశారు.  గత కొద్ది రోజులుగా, సీబ్ మరియు బురైమి లలో మొత్తం ఆరుగురు శ్రామికులు గాయాలపాలయ్యారు; ఇక్కడి ఒక భారతీయ సమాజ సేవకుడు మాట్లాడుతూ,  కనీసం నెలకు నలుగురు శ్రామికులు ప్రమాదాల పాలైన కేసులను తాము డీల్ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల నుండి ఎక్కువగా అత్యవసర కాల్స్ వస్తున్నాయని, వారిలో చాలామంది సరయిన రక్షణ ఏర్పాట్లు లేకుండానే తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకుంటున్నారని,  దురదృష్టవశాత్తూ తీవ్రగాయాల  పాలవుతున్నారని,  మస్కట్ కు చెందిన సోషల్ వర్కర్ షమీర్ పి. టి. కె. తెలిపారు.  భద్రత గల వాతావరణంలో పనిచేయడం ప్రతి ఒక శ్రామికుడి హక్కు అని, బూట్లు, గ్లొవ్ లు, తల మరియు కళ్ళకు రక్షణ, ఇంకా సైట్ సేఫ్టీ కొరకు శిక్షణ పొందటం వంటి వాటిని యజమాన్యం తప్పక కల్పించాలని, కాంపిటెన్స్ హెచ్ ఆర్ ట్రైనింగ్ మానేజర్ మార్క్ పడ్వెల్  తెలియజేశారు. ప్రాణo  కంటే, భద్రతా పరికరాలకు, శిక్షణకు అయ్యే ఖరీదు విలువ ఎక్కువేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com