టి.ఆర్.యస్ ఎంపీ కవిత సహకారంతో 'లైఫ్ ఎగైన్' చిత్రం
- August 26, 2015
క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో స్ఫూర్తినింపుతూ తన స్వీయ అనుభవాలతో హైమారెడ్డి నటిస్తూ దర్శకత్వం వహించిన 'లైఫ్ ఎగైన్' లఘు చిత్ర ట్త్రెలర్ ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ జాగృతి సమర్పణలో ఎస్.కె.ఆర్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, సీనియర్ నటి గౌతమి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ...క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధిని జయించడంతో పాటు బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి లఘ చిత్రాన్ని నిర్మించిన హైమారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. క్యాన్సర్ కేవలం రోగిని మాత్రమే కాకుండా చుట్టూ వున్న కుటుంబ సభ్యుల్ని కూడా మానసిక వేదనకు గురిచేస్తుంది. లైఫ్ ఎగైన్ చిత్రం క్యాన్సర్ రోగుల్లో బ్రతకాలనే ఆకాంక్షను నింపుతుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు ప్రభుత్వం తరపున పన్ను రాయితీని ఇప్పించేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి చర్చిస్తాను అన్నారు. గౌతమి మాట్లాడుతూ రెండు రకాల క్యాన్సర్స్ వచ్చినా సడలని విశ్వాసంతో చికిత్స తీసుకొని సంవత్సరం తిరిగే లోపే బాహ్యజీవితంలోకి అడుగుపెట్టింది హైమారెడ్డి. నా దృష్టిలో ఇలాంటివారే నిజమైన హీరోలు. క్యాన్సర్ ఎవరికైనా రావొచ్చు. అందరిలో ఈ లైఫ్ ఎగైన్ చిత్రం స్ఫూర్తినింపుతుందని ఆశిస్తున్నాను. కవిత సహాయసహకారాలతో లైఫ్ ఎగైన్ చిత్రం ప్రతి ఒక్కరికి చేరువవ్వాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. తాను క్యాన్సర్‌ను జయించడానికి గౌతమి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నానని, ఎంపీ కవిత సహాయసహకారాలతో లఘు చిత్రాన్ని నిర్మించానని హైమారెడ్డి తెలిపారు. ఈ లఘు చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, కెమెరా: ప్రవీణ్, పాటలు: కిట్టు విస్సాప్రగడ, దర్శకత్వం: హైమారెడ్డి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









