'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' ఆడియో విడుదల చేసిన పవర్ స్టార్
- November 06, 2016
హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సప్తగిరి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'. అరుణ్ పవార్ దర్శకుడు. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై డాక్టర్ కె.రవికిరణ్ నిర్మిస్తున్నారు. బల్గానిన్ స్వరాలు సమకూర్చారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఆడియో విడుదల కార్యక్రమానికి సినీనటుడు పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోను ఆవిష్కరించారు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. 'గబ్బర్‌సింగ్'లో సప్తగిరి నటించారు.చిన్న వేషం అయినా అది చూసినప్పుడల్లా పడి పడి నవ్వేవాడిని. తొలుత చిత్రానికి 'కాటమరాయుడు' అని పెట్టుకున్నారు. కానీ మా చిత్ర బృందం ఆ టైటిల్ అడిగితే ఎంతో ఉదాత్తంగా ఇచ్చేశారు. నటుడు సప్తగిరి, నిర్మాత కిరణ్, దర్శకుడిది అరుణ్ పవార్లది గొప్ప సంస్కారం. మామూలుగా సినిమాలను తక్కువ చూస్తా. ఆఖరికి నా సినిమాలు కూడా ఒక్కోసారి చూడను. కానీ సప్తగిరి నటించిన ఈ సినిమా తప్పకుండా చూడాలని కోరిక కలుగుతోంది. ప్రత్యేక షో వేయించుకుని చూస్తా. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
కథానాయకుడు సప్తగిరి మాట్లాడుతూ.. 'ఇంతమంది మెగా అభిమానుల మధ్య ఒక మెగా అభిమాని ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. పవన్ కల్యాణ్‌గారి సమక్షంలో ఇలాంటి ఓ కార్యక్రమం జరుగుతుందని నా జీవితంలో వూహించలేదు. పుట్టినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ, అభిమానిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాను. నేను నిజాయతీ గల మెగా అభిమానిని కనుకే పవన్ నా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. ఆయనకు రుణపడి పడి ఉంటా. ఇంత చిన్న సినిమాకు రూ.కోట్లు విలువ చేసే అభిమానాన్ని పంచినందుకు పవన్‌కల్యాణ్ గారికి ధన్యవాదాలు' అని అన్నారు.
కార్యక్రమంలో సినీ నటులు అలీ, సునీల్, నాగ్ అన్వేష్, హేమ, నిర్మాత శరత్‌మరార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









