యువ దర్శకులతోనే ఎన్టీఆర్ కొత్త సినిమా..!
- November 06, 2016
ప్రతిభ ఎవరి సొత్తూ కాదు. ఎవరిలో ఎంత సత్తా ఉందో తెలియదు. పరిశీలించి అన్వేషిస్తే ఆ ప్రతిభ దొరుకుతుంది. ప్రస్తుతం ఈ టాలెంట్ ను వెతికే పనిలో పడ్డాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిన్నటిదాకా.పేరున్న దర్శకులు, అప్పుడే సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్లతో సినిమాలు చేసిన ఎన్టీఆర్.ఇప్పుడు తన ఆలోచనా ధోరణి మార్చుకున్నాడు. పెద్ద దర్శకులతో విసిగిపోయిన ఈ స్టార్..యువ దర్శకుల ప్రతిభను పరీక్షించాలని భావిస్తున్నాడు.'జనతా గ్యారేజ్' తో వంద కోట్ల క్లబ్ లో చేరినా.ఇలాంటి లెక్కలు వేసుకోకుండా తన కొత్త సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే పటాస్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, 'ప్రేమమ్' దర్శకుడు చందూ మొండేటితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి నిర్మాత దిల్ రాజుతో కలిసి హీరో రామ్ కు ఓ కథ వినిపించారు. ఈ కథలో హీరో గుడ్డివాడు. ఇదొక ప్రయోగాత్మక చిత్రమవుతుంది అంతా అనుకున్నారు. తీరా ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆ కథనే ఎన్టీఆర్ కు చెబితే.ఇప్పుడున్న ఇమేజ్ కు సరికాదని, మరో కథ చేసుకు రమ్మని పురమాయించాడు. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఈ కథ తయారీలోనే ఉన్నాడు. మరోవైపు చందూ మొండేటి ఓ యాక్షన్ థ్రిల్లర్ కథను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లాడట. ఈ స్టోరీకి కూడా యంగ్ టైగర్ సానుకూలంగానే ఉన్నాడు. ఈ ఇద్దరు యువ దర్శకులతోనే ఎన్టీఆర్ కొత్త సినిమా ఉండబోతోంది. ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఉన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత పూరీ జగన్నాథ్ తో ఈ స్టార్ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇజం ఫలితం నేపథ్యంలో పూరీ పట్ల ఆయన ఆసక్తి తగ్గిపోయింది. అటు త్రివిక్రమ్ సినిమా చేస్తాడనుకున్నా.పవన్ కళ్యాణ్ తో చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా పూర్తవ్వాలంటే ఏడాది కావాలి. ఎన్టీఆర్ వీవీ వినాయక్ తో 'అదుర్స్ 2' ను మరో ఆప్షన్ గా పెట్టుకున్నా.వినాయక్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి అది పూర్తయినా.కథ సిద్ధం కావాలంటే మరో ఆర్నెళ్లు కావాలి. ఇంత సమయం సినిమా చేయకుండా ఉండటం ఎన్టీఆర్ కు ఇష్టం లేదు. అందుకే యువ దర్శకులైనా తన స్థాయికి తగిన సినిమా చేస్తారేమో అని ఆశలు పెట్టుకున్నాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









