ఇస్రో మెప్పు పొందిన విద్యార్థినులు
- November 06, 2016
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికితోడు స్మార్టు సిటీల రూపకల్పన వూపందుకుంటోంది. గతంతో పోల్చితో ప్రముఖుల రాకపోకలు ఎక్కువయ్యాయి. వాహనాల సంఖ్య, ట్రాఫిక్ రద్దీ అంతకంతకూ అధికమవుతోంది. అపరిచిత వ్యక్తుల కదలికలు పెరిగాయి. భద్రత, నిఘా అనేది కీలక అంశంగా మారింది. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని పది నెలల పాటు అధ్యయనం చేసి నూతన ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఇస్రోకు సమర్పించారు విజయవాడ నగరంలో వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఎంటెక్ చివరి సంవత్సరం విద్యార్థినులు.
తాము చదువుకున్న పాఠ్యాంశాల ఆధారంగా వీడియో అనలటిక్స్, ఇమేజ్ ప్రాసెసింగ్ ఉపయోగించి ఎడ్రిన్(అడ్వాన్సుడు డేటా ప్రాసెసింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్) ఇస్రో ఆధ్వర్యంలో పరిశోధనలు చేసి ఔరా అనిపించారు. ఆ ప్రాజెక్టులు ఏంటి? వాటివల్ల ప్రయోజనాలేంటి?ఎలా రూపొందించారు? తదితర విశేషాలపై ప్రత్యేక కథనం. విద్యార్థి : వినీల
చేసిన ప్రాజెక్టు: డైనమిక్ అనాలసిస్ ఆఫ్ ఆబ్టెక్టు యూజింగ్ సీన్ జామెట్రీ ఇన్ వీడియో సీక్వెన్సెస్
ప్రత్యేకత: ఏ ప్రాంతంలోనైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలను సులువుగా గుర్తించవచ్చు. వాహనం ఎంత వేగంతో వెళుతుంది? అనే అంశాన్ని కూడా ఈ ప్రాజెక్టులో అంచనా వేశారు. కెమెరాల ముందు కనపడి.. తరువాత ఆ వాహనం కనపడకపోతే.. ఆ వాహనం అనుమానాస్పదమా? లేకా మామూలు వాహనమా? అనే విషయంపై విశ్లేషణ చేయవచ్చు. వంతెనపై వాహనం వెళుతున్నప్పుడు కెమెరాల ద్వారా ఈ వాహన గమనాన్ని విశ్లేషించి ఎంతవేగంతో వెళుతుందో కనుగొనవచ్చు. ఈ వాహనం వల్ల ఇతర వాహనాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. దీనివల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అంటోంది వినీల.
విద్యార్థి: వి.రమ్య
ప్రాజెక్టు: పర్సన్ రీ ఐడింటిఫికేషన్ అక్రాస్ మల్టిపుల్ కెమెరా వ్యూస్
ప్రత్యేకత: ఇమేజ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ ప్రాజెక్టు చేసింది. ఇందులో బ్యాంకుల్లో కానీ, మాల్స్‌లో కానీ, ఎయిర్‌పోర్టుల్లో కానీ, రద్దీ ఉన్న ప్రదేశాల్లో కానీ రెండు అంతకంటే ఎక్కువ కెమెరాల ద్వారా విశ్లేషించే విధంగా ప్రాజెక్టు చేసింది. ఒకే వ్యక్తి వివిధ కోణాల్లో వివిధ కెమెరాల్లో పలు రకాలుగా కనిపిస్తాడు. అటువంటి సమయంలో అనుమానాస్పద వ్యక్తిని గుర్తించటం కష్టం. కానీ ఈ ప్రాజెక్టు ద్వారా అతనిని ఏ కెమెరాలో చూసినా ఇట్టే గుర్తించవచ్చని అంటోంది రమ్య.
విద్యార్థిని: సుధారాణి
ప్రాజెక్టు: సపోర్టు వెక్టార్ మెషిన్ బేసిడ్ క్లాసిఫికేషన్
ప్రత్యేకత: ఇందులో వ్యక్తి ముఖకవళికలతో పాటు కళ్లు, ముక్కు ఇతర అవయవాలను సమగ్రంగా ఫొటోలుతీసి.. ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా విశ్లేషణ చేసే ప్రాజెక్టు చేసింది. ముఖకవళికలను ఎస్వీఎం క్లాసిఫికేషన్‌కు అందించి ఆ వ్యక్తులను నిశితంగా గుర్తించేలా చేసింది. అనుమానాస్పద వ్యక్తులను భద్రతాపరమైన ప్రాంతాలకు పంపకుండా చేయటానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. వివిధ ప్రాంతాలలో ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చని అంటోంది సుధారాణి.
విద్యార్థి : పి.స్వాతి
ప్రాజెక్టు : ఫేస్ రికగ్నైజేషన్ యూజింగ్ హోప్ఫీల్డు నెట్వర్కు
ప్రత్యేకత : ఇప్పటి వరకు కార్యాలయాలు, కళాశాలల్లో వేలిముద్ర ఉపయోగించి బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వ్యక్తి ముఖకవళికల ద్వారా గుర్తించి కార్యాలయాలు ఇతర కళాశాలల్లోకి వెళ్లే విధానం రూపొందించింది. సంబంధిత వ్యక్తి వేలిముద్రతో కాకుండా సిస్టమ్ వద్దకు వెళితే.. అందులో తన ఫొటో నిక్షప్తమై ఉంటే.. తక్షణమే సిస్టమ్ గుర్తించి అతనిని లోపలికి పంపిస్తుంది. లేదా హాజరు వేస్తుంది. ఇది వేలిముద్రల కంటే మెరుగైన విధానం. వీటిని కంప్యూటర్ భద్రతలోను, నేరపరిశోధనలోను ఏటీఎంలలోను విజయవంతంగా ఉపయోగింవచ్చని చెబుతోంది స్వాతి.
పరిశోధనలకు ప్రాధాన్యం
కళాశాలలో వీడియో అనలటిక్స్ ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేసిమరీ పరిశోధనలు చేయటానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మా ఎంటెక్ విద్యార్థినులు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా హైదరాబాదు ఇస్రో ఆధ్వర్యంలోని ఎడ్రిన్(అడ్వాన్సుడు డేటా ప్రాసెసింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్)లో పది నెలలపాటు కీలక ప్రాజెక్టులు చేయడం సంతోషంగా ఉంది. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని నూతన రాజధానికి అవసరం. భద్రతపరంగా వీడియో అనలటిక్స్, ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలను ఉపయోగించి మరిన్ని మంచి ప్రాజెక్టులు ఆవిష్కరించేలా తమవంతు కృషి చేస్తాం.
- వడ్డి శ్రీనివాసరావు, కంప్యూటర్స్ సైన్స్ విభాగాధిపతి, వీఆర్ సిద్ధార్థ
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









