తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ ....
- November 06, 2016
పవిత్ర కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోన్ని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలతో పాటు నదీ తీర ప్రాంతాల్లో ఉన్న శివాలయాల్లో రద్దీ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్లో..
ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తిలతో పాటు పంచారామ క్షేత్రాలైన అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే నదీజలాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.
తెలంగాణలో..
రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ, కీసర, వరంగల్లోని వేయి స్తంభాల ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు చేరుకుని శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









