శత్రువులకి పిండం పెట్టిన ఘనత పృధ్వీకే దక్కింది..
- November 07, 2016
టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా దూసుకెళ్తున్నాడు థర్టీ ఇయర్స్ పృధ్వీ. ఈ మధ్య వస్తోన్న చిత్రాల్లో పృధ్వీ హంగామా ఎక్కువైంది. బాయిలింగ్ స్టార్ బబ్లు, ఫ్యూచర్ స్టార్ సిద్దప్ప, మల్లెపుష్పం రామారావు, ఇగో రెడ్డి .. పాత్రలతో హల్ చల్ చేశాడు. అదే సమయంలో తనకు శత్రువులు ఎక్కువయ్యారని పృధ్వీ ఫీలవుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా, ఫేస్ బుక్ లో పృధ్వీ పోస్ట్ చేసిన ఓ పిక్ ని చూస్తే ఇదే నిజమనిపిస్తోంది.
తల్లిదండ్రులకి పిండాలు పెడుతోన్న పిక్ ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాదు పృధ్వీ. ఇది సినిమా పిక్ కాదండోయ్. నిజంగానే పిండాలు పెట్టాడు. ఈ పిక్ క్రింద తల్లి దండ్రులతో పాటుగా.. శత్రువులకి కూడా పెడుతున్నాని కామెంట్ పెట్టాడు.ఇప్పుడీ కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. పృధ్వీకి శత్రువులెరబ్బా.. అంటూ ఆరాతీయడం మొదలైంది ఫిల్మ్ నగర్ వర్గాల్లో.అయితే, ఈ మధ్య పెళ్లి చేసుకుని మోసం చేసాడంటూ ఫృధ్వీపై పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. పృథ్వీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక అతడిపై కొంతమంది కుట్ర చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా కుట్రలో భాగమని ఫీలవుతున్న పృధ్వీ.. శత్రువులకి కూడా పిండం పెడుతున్నట్టు పోస్ట్ పెట్టాడు. ఏదేమైనా.. శత్రువులకి పిండం పెట్టిన ఘనత పృధ్వీకే దక్కింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు









