రోడ్ సైడ్ వెండర్స్ ఆక్రమణ
- November 07, 2016
మనామా: క్యాపిటల్ సిటీలోని కొన్ని రోడ్లను రోడ్‌సైడ్ వెండర్స్ ఆక్రమించుకోవడంతో ట్రాఫిక్ సమస్యలతోపాటు, సాధారణ ప్రజానీకం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తోంది. గుడైబియా ప్రాంతంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ రోడ్ సైడ్ వెండర్స్ కారణంగా సిటీ అందాలు దెబ్బతింటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి పౌరుల నుంచి. అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నా, రోడ్ సైడ్ వెండర్స్ అప్పటికప్పుడు అక్కడినుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చేస్తున్నారు. తమ వ్యాపారాల్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్‌గా మార్చేసుకుంటుండడంతో సమస్య తీవ్రతరమవుతోంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్, టెక్స్‌టైల్స్, కాస్మెటిక్స్ వంటి అమ్మకాల్ని పుట్ పాత్ నుంచి రోడ్ల మీదకు తీసుకొచ్చేస్తున్నారు. గుడైబియా వాసులు అధికారుల్ని ఈ సమస్యపై పదే ప్రశ్నిస్తున్నారు, అభ్యర్థిస్తున్నారు కూడా. అయితే ఈ చిన్న చిన్న వ్యాపారాల మీదనే తమ జీవనం ఆధారపడి ఉందని వెండర్స్ చెప్పడం జరుగుతోంది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్









