ఏడాది చివరినాటికి డ్యూస్ చెల్లింపు పూర్తి
- November 08, 2016
రియాద్: సౌదీ అరేబియా ప్రైవేటు కంపెనీలతో కలిసి డ్యూస్ చెల్లింపు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. డిసెంబర్ నాటికి డ్యూస్ అన్నిటినీ చెల్లించాలని డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో జరిగిన కమిటీ తీర్మానించింది. డిలే అవుతున్న పేమెంట్స్‌ని క్లియర్ చేయడానికి పబ్లిక్ ట్రెజరీ నుంచి ప్రైవేట్ సెక్టార్‌కి నిధుల్ని తరలిస్తారు. ఆయిల్ ధరల పతనం నేపథ్యంలో తలెత్తిన సంక్షోభ నివారణ కోసం ఈ చర్యలను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కన్స్ట్రక్షన్ రంగంలోని కార్మికులు కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఊరటగా చెప్పవచ్చు. సబ్సిడీ కటింగ్స్, క్యాబినెట్ మినిస్టర్స్ జీతాల్లో కోత, కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్ని పక్కన పెట్టడం వంటి చర్యలను చేపట్టడం ద్వారా సంక్షోభం నుంచి ఉపశమనానికి ప్రయత్నిస్తోంది సౌదీ ప్రభుత్వం. గత నెలలో సౌదీ బిన్లాడిన్ గ్రూప్, కొంత మొత్తాన్ని విడుదల చేసిందనీ, దాంతో కార్మికులకు ఊరట లభించిందని పేర్కొంది. 70,000 మంది లెయిడ్ ఆఫ్ వర్కర్లకు చెల్లింపులు కూడా పూర్తి చేసినట్లు ఆ కంపెనీ వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









