సుకుమార్ రామ్‌చరణ్‌తో...
- November 10, 2016
సుకుమార్ కథలు వైవిధ్యంగా సాగిపోతుంటాయి. సైన్స్ ఫిక్షన్, మైండ్ గేమ్, థ్రిల్లర్ అంటే ఆయనకు ఇష్టం. ఇప్పుడు రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నారాయన. ఆ కథ కూడా సైన్స్ ఫిక్షన్ అని తెలుస్తోంది. ఈచిత్రానికి 'ఫార్ములా ఎక్స్' అనే పేరు పెట్టారని గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో పేరు బయటకు వచ్చింది. ఫేస్ బుక్ చాటింగ్ ఎట్ 8 పీఎమ్ అనే పేరు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చిత్రబృందం మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. ''సుకుమార్ సినిమాల్లో లెక్కలు, ఫార్ములాలూ కనిపించొచ్చు.కానీ టైటిళ్లు మాత్రం అందరికీ నచ్చేలా, కమర్షియల్ సూత్రాలకు లోబడే ఉంటాయి. ఈసారీ అలాంటి టైటిల్‌నే ఎంచుకొంటారు'' అని సుకుమార్ సన్నిహితులు చెబు తున్నారు. ఈయేడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. కథానాయికగా రాశీఖన్నా పేరు ఖరారైందని సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









