జహ్రా మాల్ లో నల్గురు అమ్మాయిలు వేధించిన వారు అరెస్టు
- November 12, 2016
జహ్రా ఒక షాపింగ్ మాల్ లో యువతులను వెంటాడి లైంగికంగా వేధిస్తున్న నల్గురు కువైటీయులనుజహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ నుండి సిబ్బంది అరెస్టు చేశారు. పలువురు వీరి వెకిలి చేష్టల పట్ల విసిగిన బాధితులు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క ఆపరేషన్స్ రూమ్ కు ఫిర్యాదు చేశారు. దానితో ఆ నల్గురు యువకులను అదుపులోనికి తీసుకొన్నారు. మరోవైపు , ఫహహీల్ పోలీసులు స్థానికంగా తయారుచేసిన 48 మద్యం సీసాలు కలిగి ఉన్న ఒక ఆసియా దేశస్థుడిని అరెస్టు చేశారు, ఈ వ్యక్తి ఒక అక్రమ మద్యపాన వర్తకుడని, నిషిద్ధ మద్యం సీసాలను ఒక సంచి నిండా నింపుకొని ఒక భవనం లోనికి ప్రవేశించాడు. అదే సమయంలో పోలీసు గస్తీ దళం తనిఖీలో నిందితుడ్నిపట్టుకొన్నారు . పోలీసుల విచారణ సమయంలో తాను మద్యం తాగమని ప్రచారం చేస్తున్నట్లు సైతం ఒప్పుకున్నాడు. దీనితో అనుమానితుడిని నిషిద్ధ డ్రగ్ మరియు ఆల్కహాల్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ అదుపులోనికి తీసుకొన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









