జనవరి 12 న విడుదలకి సిద్ధమవుతున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి'
- November 15, 2016
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ కథానాయిక. హేమామాలిని కీలక పాత్రలో కనిపించనున్నారు. వై.రాజీవ్‌రెడ్డి నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, శ్రియలపై నృత్య దర్శకురాలు బృంద నేతృత్వంలో ఓ గీతాన్ని తెరకెక్కించారు. దీంతో చిత్రీకరణ పూర్తయింది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. డిసెంబరు మొదటి వారంలో ప్రచార చిత్రాన్ని, రెండోవారంలో పాటల్నీ విడుదల చేస్తారు.
కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ''తెలుగు జాతి గర్వించదగిన వీరుడి కథ ఇది. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చరిత్ర చెప్పిన విషయాలతో పాటు, మేం పరిశోధించిన అంశాల్నీ తెరపై ఆవిష్కరిస్తున్నాం. యుద్ధ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకొంటాయ''ని చిత్రబృందం తెలిపింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







