అమరావతి లో ఎస్ఆర్ఎం వర్సిటీకి 200 ఎకరాలు
- November 16, 2016
రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలో ఎస్ఆర్ఎం యూనివర్శిటీకి 200 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్ఆర్ఎంకు భూములు ఇచ్చే విషయమై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయగా... ఎస్ఆర్ఎంకు భూములు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని, ఈ నేపథ్యంలో భూమి కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తొలిదశలో 100 ఎకరాలు కేటాయిస్తామని, 17,500 మంది విద్యార్థులకు ఇక్కడ విద్యనభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు. తొలిదశలో ఇచ్చిన 100 ఎకరాలకు సంబంధించి నిర్దేశించిన ఫలితాలను సాధిస్తే రెండో దశలో 100 ఎకరాలను కేటాయిస్తామన్నారు. ఎకరా రూ.50 లక్షలకు ధర కేటాయించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







