దివిసీమ ఉప్పెనకు నేటితో 39 ఏళ్లు

- November 18, 2016 , by Maagulf
దివిసీమ ఉప్పెనకు నేటితో 39 ఏళ్లు

1864  నవంబర్ 1 వ తేదీన సంభవించిన తుపాను బందరు , చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యం చేసుకొని దయాదాపు 30 వేల మందిని జలసమాధి చేస్తే, 113  ఏళ్ళ తర్వాత అదే స్థాయిలో వచ్చిన ఉప్పెన దివిసీమను లక్ష్యంగా చేసుకొంది. నేడు ఉన్నట్లుగా సమాచార వ్యవస్థ గానీ , వాతావరణ హెచ్చరికలు లేకపోవడంతో తమకేమి జరుగుతుందో తెలిసేలోపున మృత్యువు ఒడిలోకి చేరుకొన్నారు.1977  నవంబర్ 19 వ తేదీ నాడు బందరు నాటి ఉప్పెనకు చిగురుటాకులా వణికింది.స్థానిక శివగంగా ప్రాంతంలో 1977  ఉప్పెనలో పలువురు మృత్యువాత చెందారు. ఆనాటి తుపాను బాధితుల ప్రభుత్వం నిర్మించిన నిర్వాసిత కాలనీ " శారదా నగర్ " నాటి కలెక్టర్ శ్రీమతి శారదా ముఖర్జీ పేరున నిర్మితమయ్యంది. దివిసీమ ఉప్పెన ఈ పేరు వింటేనే కృష్ణాజిల్లాలోని దివిసీమ వాసులు ఉలిక్కిపడతారు. తీరప్రాంతాన్ని ఆనుకొని ఉండే దివిసీమ సముద్రుడి ఉగ్రరూపాన్ని చూసిన రోజు అది. 1977 నవంబరు 19....ఆ రోజు మధ్యాహ్నం సముద్రంలో చిన్న అలజడి ప్రారంభమైంది. సాయంత్రానికి అలజడి ఉధృతమైంది. ఆ తర్వాత ఆ ఉధృతి పెను ఉప్పెనగా మారింది. ఉప్పెన ఉగ్రరూపం దాల్చడంతో సముద్రుడు ఊళ్లకు ఊళ్లనే కబళించాడు. అంతే తెల్లారేసరికి వేలమంది బ్రతుకులు తెల్లారిపోయాయి.  

అర్థరాత్రి - కృష్ణ , గుంటూరు జిల్లాల ప్రజలకు కాళరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా సముద్రం ఒక్కసారిగా విరుచుకుపడింది. అధికారిక లెక్కల ప్రకారం 10,000  మంది శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. అనధికారిక లెక్క లక్ష పై మాటే ! ఎక్కడచూసినా గుట్టలుగా మనుష్యుల, పశువుల శవాలు. ఎటు తిరిగినా కూలిపోయిన ఇళ్ళూ, చెట్లూ!!  కళ్ళ ముందే మనుష్యుల్ని, పశువుల్ని తాడిచెట్టు పరిమాణానికి ఎగరవేస్తుంటే..... బాధితులు చెబుతుండగా ఒళ్ళు జలదరిస్తుంది. 19 నవంబర్‌ 1977 నాడు ఆంధ్రప్రదేశ్‌ మొత్తం నేటి వరకూ ఎప్పుడూ ఎదుర్కొనని ఘోర తుఫానుకు గురయింది. కృష్ణాజిల్లాలో కృష్ణానదిలో ఉన్న దివిసీమ దీవి ముంపుకు గురయ్యింది. గుట్టలు, గుట్టలుగా మనుషులు, పశువుల శవాలతో అతి భయంకర విలయం తాండవించి లెక్కలకు తెలినవే పదివేలయితే లెక్క లేకుండా కొట్టుకుపోయిన శవాలు ఎన్నో వేలు. అది ఆంధ్రప్రదేశ్‌ మొత్తాన్ని వారం రోజుల పాటు ముంచెత్తింది. 14వ తేదీనుండి 22వరకూ వర్షం, చలిగాలులతో గజ గజ లాడించింది.
నష్టం భారీగానే1977 ఆంధ్రప్రదేశ్‌ తుఫాను నవంబరు 19న ఆంధ్రప్రదేశ్‌తోపాటు పొరుగు రాష్ట్రాలల్లోనూ విధ్వంసకర తుఫాను ఉంది. అధికారక లెక్కలు ప్రకారం 10వేలే అయినా... దాదాపు 14,204 మంది చనిపోయారు. ఈ తుఫాను నష్టం దాదాపు అప్పట్లో రూ.250కోట్లు. జన జీవనం అన్ని రకాలుగా తీవ్రంగా నష్టపోయింది. పంటలతో పాటు, మత్య్సకారుల పడవలు గల్లంతయ్యాయి. 100 గ్రామాల్లో ఈ తుఫాను భీభత్సం కనబడింది. 35 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. దివిసీమ శవాల దిబ్బగా మారిపో రుుంది. ఎక్కడ చూసినా శవాలే. ఈ ఘటనలో నాలుగు లక్షల జంతువులు మృత్యువాత పడ్డారుు. మెుత్తం రూ.172కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. అంతటి విషాదాన్ని మిగిల్చిన ఆ కాళరాత్రి గుర్తుకువస్తే దివిసీమ వాసులు ఇప్పటికీ ఉలిక్కిపడతారు. అశువు లుబాసిన వారికి గుర్తుగా దివిసీమలో స్తూపాలు నిర్మించి వారికి నివాళులర్పిస్తారు. ఆనాటి నేటి వరకూ నవంబర్‌ 19 వస్తుందంటే దివిసీమవాసులు ఎవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్ళడానికి సాహసించరు. ఉప్పెన తాలుకు విషాదఛాయలు ఎంతలా వెంటాడుతున్నాయో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేటికి దివిసీమలో ఎవరిని కదల్చినా ఆ విషాదఛాయల గురించి కళ్ళకు కట్టినట్లు చెబుతారు. ముఖ్యంగా నాగాయలంక మండలం సొర్లగొంది తీరప్రాంత గ్రామాన్ని సముద్రుడు ముంచెత్తాడు. అర్ధరాత్రి పూట కట్టలు తెంచుకున్న ప్రవాహం గ్రామాలపై విరుచుకుపడ్డాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే 714 మంది మృత్యువాతపడ్డారు. చిమ్మ చీకట్లో ఉధృతంగా విరుచుకుపడ్డ వరదలో అనేకమంది కొట్టుకుపోతూ.. తుమ్మ ముళ్ల కంపలకు చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు వదిలారు. పశుపక్ష్యాదులు సైతం మృత్యువాతపడ్డాయి. 200 కిలోమీటర్ల వేగంతో వీసిన ప్రచండ గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు విల్లుల్లా వంగిపోయాయి. గ్రామం మొత్తాన్ని శ్మశానంగా మార్చింది. శవాల గుట్టల మధ్య తమవారి ఆనవాళ్లను వెతికేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. రామాలయం, పంచాయతీ కార్యాలయంలో తలదాచుకున్న 200 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com