డయాబెటిస్‌పై అవగాహన: వేలాదిమంది హాజరు

- November 18, 2016 , by Maagulf

దుబాయ్‌లో డయాబెటిస్‌పై అవగాహనా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అవేర్‌నెస్‌ కార్యక్రమంలో వేలాదిమంది పాల్గొన్నారు. 3.8 కిలోమీటర్ల మేర ప్రజలు డయాబెటిస్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవగాహనతో డయాబెటిక్‌ సమస్యలు తగ్గుతాయనీ, ఆరోగ్యకరమైన జీవితం డయాబెటిస్‌ని దూరం చేస్తుందని ఈ సందర్భంగా పలువురు వైద్యులు చెప్పారు. అవగాహనా కార్యక్రమం నేపథ్యంలో ఏర్పాటు చేసిన కియోస్క్‌లో బ్లడ్‌ గ్లూకోజ్‌ టెస్టింగ్‌ సౌకర్యాన్ని పలువురు వినియోగించుకున్నారు. జుంబా మరియు యోగా ఫిట్‌నెస్‌ సెషన్స్‌, అలాగే స్పాట్‌ డాన్స్‌ వంటివి ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యూఏఈలో ప్రధానంగా ప్రజల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్‌ ముఖ్యమైనది. దీన్ని ఎదుర్కొనేందుకు పలు అవేర్‌నెస్‌ ఈవెంట్లు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com