భారతీయ సినీ పరిశ్రమకు మారిషస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది
- November 19, 2016
భారతీయ సినీ పరిశ్రమకు మారిషస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో సినిమా షూటింగ్ లకోసం వచ్చే భారతీయ సినీ నిర్మాతలకు భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. మారిషస్ ద్వీపంలో షూటింగ్ నిమిత్తం ఇచ్చే ఇండియన్ ఫిలిం మేకర్స్ కి 40 శాతం పన్ను వదులుకునేందుకు అంగీకారం కుదిరినట్టు మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగతివార్ వెల్లడించారు. రాష్ట్రంలో మూడురోజుల పర్యటనకు వచ్చిన మారిషస్ ప్రధానమంత్రి అనిరుధ్ జగన్నాథ్ తో జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందని తెలిపారు. టూరిజం, లాజిస్టిక్స్, విద్య, చక్కర పరిశ్రమ రంగంలాంటి వివిధ అంశాలతోపాటు సినీ పరిశ్రమరంగం కూడా ఒకటని పీటీఐకి చెప్పారు. 60 మంది పారిశ్రామికవేత్తలు, 20 మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు ఆయన వివరించారు.ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో వాణిజ్య చర్చలతో పాటు సులభమైన వ్యాపార నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపినట్టు తెలిపారు. అలాగే పర్యాటక అభివృద్ధికి, ముఖ్యంగా అందమైన బీచ్ లను అందంగా తీర్చిదిద్దడంలో మారిషస్ అనుసరిస్తున్న పద్ధతులను మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. కాగా థాయ్ లాండ్ లాంటి ప్రముఖ పర్యాటక దేశాలు భారతీయ సినీ నిర్మాతలకు ఇప్పటికే పన్ను రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







