క్యాప్సికం మసాలా రైస్
- August 30, 2015
స్కూల్స్ మొదలయ్యాయి కదా మరి పిల్లలకి రుచి రుచిగా అనిపించే ఒక రైస్ ఐటెం చూద్దామా!! అదే క్యాప్సికం మసాలా రైస్!!!
కావలసిన పదార్ధాలు:
- ఉడికించిన అన్నం - 3 కప్పులు
- నెయ్యి / నూనె - 1 1/2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీ స్పూను
- కరివేపాకు - 10 రెమ్మలు
- క్యాప్సికం - 2 పెద్దవి
- ఉప్పు - తగినంత
- కొబ్బరి తురుము - 1 టేబుల్ స్పూను
- దోరగా వేయించిన వెరుశనగ - 1 టేబుల్ స్పూను
పౌడర్ కొరకు:
- ఎండు మిర్చి - 3 లేదా 4
- ధనియాలు - 1 టేబుల్ స్పూను
- జీలకర్ర - 1 1/2 టీ స్పూను
- మినపప్పు - 1 టీ స్పూను
- దాల్చిన చెక్క - 1 ముక్క
- వెఇంచిన వేరు శెనగ - 2 టేబుల్ స్పూను
- నెయ్యి - 1 టీ స్పూను
తయారు చేయు విధానం:
- ఒక బాండీలో నెయ్యి వేసి, జీలకర్ర, మినపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు ఎండుమిర్చి, ధనియాలు, దాల్చిన చెక్క, కరివేపాకు వేసి పచిదనం పోయే దాకా వేయించాలి. చివరగా వేయించిన వెరుశెనగ వేసి మరి కాసేపు వేయించి దించేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు అదే బాండీలో నెయ్యి లేదా నూనె వేసి ఆవాలు వేయండి. ఆవాలు చిటపట లాడిన తర్వాత కరివేపాకు వేసి అవి కాస్త క్రిస్పీ గా అయ్యే దాక వేయించండి.
- తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను వేసి ఒక 3 నిమిషాల పాటు వేయించండి. క్యాప్సిచుం ని మరీ వేయిన్చండ్డు అవి కాస్త కరకర మంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసి కలపండి.
- ఇప్పుడు ఉడికించిన అన్నం వేసి బాగా కలపండి.
- కొబ్బరి తురుము, వేయించిన వెరుశెనగ, దంచి పెట్టుకున్న పొడి వేసి బాగా కలపాలి.
- అంతే ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం రైస్ రెడీ..ఇది ఏదన్న గ్రేవీ తో, పచ్చడితో లేదా పెరుగుతో తింటే చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









