అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకోనున్న'సత్య గ్యాంగ్'
- November 21, 2016
పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పనిచేసిన యువ ప్రతిభాశాలి ప్రభాస్ నిమ్మలను దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సత్య గ్యాంగ్’. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై యం.మహేష్ కన్నా-ఎస్.మంగారావు, చలపతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 24న (గురువారం) అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.
ప్రత్యూష్ వి.ఆర్., హర్షిత పన్వార్, కిషన్ కన్నయ్య కె.కె., సాత్విక్, సిరి కొమ్ము, వినోద్ కుమార్, జీవా, సమీర్, జెన్ని, బి.హెచ్.ఇ.ఎల్. ప్రసాద్, విజయ్, చిట్టిబాబు, జబదర్దస్త్ అప్పారావు, గబ్బర్‌సింగ్ రాజశేఖర్, అంజిబాబు, ప్రేమ్, మహేష్ కన్నా ముఖ్యపాత్రలు పోషిస్తున్న "సత్య గ్యాంగ్" చిత్ర ప్రారంభోత్సవంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని, యూనిట్ సభ్యులకు శుభాశీస్సులు అందజేయనున్నారు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి ఆర్ట్: డేవిడ్, ఎడిటింగ్: నందమూరి హరి, సినిమాటోగ్రఫీ: అడుసుమిల్లి విజయ్ కుమార్, కో-డైరెక్టర్: కొండలరావు, నిర్మాతలు: ఎం.మహేష్ కన్నా-ఎస్.మంగారావు-చలపతి, కథ-స్క్రీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల !!
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









