చర్మ సౌందర్యానికి బీట్ రూట్
- April 16, 2015
కంటి కింద నల్లని వలయాలను నివారించాలంటే బీట్‌రూట్ రసం అద్భుతంగా పనిచేస్తుంది. బీట్‌రూట్ రసంలో ఉండే లక్షణాలు కళ్ల ఉబ్బును కూడా నివారిస్తుంది. రెండు చెంచాల బీట్‌రూట్ రసంలో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలూకు మచ్చలను కూడా పూర్తిగా నివారిస్తుంది. * బీట్‌రూట్ జ్యూస్ ముఖానికి ఐప్లె చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బీట్‌రూట్ పేస్ట్‌లో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మ రంగులో మార్పు కనిపిస్తుంది. * ఒక టీస్పూన్ బీట్‌రూట్ జ్యూస్‌లో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. * బీట్‌రూట్ రసం, చక్కెర కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్క్రబ్ చేయడం వల్ల ముఖంలో ఉండే నల్లమచ్చలను నివారించవచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









