సీతాకోక చెప్పింది
- April 17, 2015
ముత్యపు బిందువుల్లా
మంచు బొట్లు ఆకులపై జారుతుంటే
రంగు రంగుల పువ్వులపై
సున్నితంగా వాలుతూ
కన్నుల విందు చేసే
సీతాకోక
క్షణం ఆగి నావైపు చూసింది
ఈనాటి నా అందచందాలని చూసి
ముచ్చటపడే నువ్వు
ఒకనాడు నా వికృతరూపాన్ని
అసహ్యించుకున్నావు
జ్ఞాపకం ఉందా?
నన్ను చూసి జనం దూరంగా
పరుగులిడిన క్షణాలు
నువ్వు మరచిపోయావేమో?
నన్ను నేను శపించుకున్న
ఆ క్షణాలు నాకు ఎప్పుడు గుర్తు ఉంటాయి
ఓ మనిషి
నీ జీవితంలోకి ఒకసారి
తొంగి చూసుకో
నేను అనుభవించిన
ఆ దుర్భర క్షణాలు
నీ జీవితంలో కూడా ఉన్నాయేమో
నాకు ఇంక గతం అక్కర్లేదు
కానీ నిన్ను గతం
నీడలా చీకటిలా
వెన్నాడుతూనే ఉంటుంది
నా గతానికీ నేను కారణం కాను
కానీ నీ గతానికీ నువ్వే కారణం
మనసు ఎప్పుడు అద్దంలాంటిది -
నీ అసలు ప్రతిబింబం చూసుకో
ఇకనయినా నిన్ను నీవు దిద్దుకో
వొద్దికగా
నీతిగా
జీవించటం నేర్చుకో
డా. మాధిరాజు రామలింగేశ్వర రావు
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







