భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి...
- November 21, 2016
జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బండీపూరలోని హంజన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న సమయంలో అక్కడే నక్కిన ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చన్న సమాచారంతో తనిఖీలు కొనసాగుతున్నాయి.సోమవారం పూంచ్, రాజౌరి జిల్లాలలో పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటంతో ఓ పౌరుడు గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు. బొసానీ గ్రామంలో అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి ఇంటిపై మోటార్ షెల్స్ పడటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు.బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రాయ్ సింగ్ సైతం పాక్ కాల్పుల్లో గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖామెనీ నియామకం
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్‌ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం









