కిం కర్దర్షియాన్ తరహాలో ఖతారీలపై దోపిడీ
- November 22, 2016
ప్యారిస్‌లో ఇటీవల ప్రముఖ సెలబ్రిటీ కిమ్ కర్దర్షియాన్పై దాడి చేసిన విధంగానే దోపిడీ దొంగలు, ఇద్దరు ఖతారీ మహిళలపై దాడి చేసి 5 మిలియన్ యూరోల విలువైన వస్తువుల్ని వారి నుంచి దుండగులు దోపీడీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవలే భారతదేశానికి చెందిన ప్రముఖ నటి మల్లికా షెరావత్ మీద కూడా ఇలాంటి దాడే జరిగింది. 60 ఏళ్ళ పైబడిన ఖతారీ మహిళలు, లె బోర్గెట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. వారి కారుని మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు అడ్డగించి, వారిపై టియర్ గ్యాస్‌ని స్ప్రే చేసి, దొంగతనానికి పాల్పడ్డారు. ఆభరణాలు, లగేజ్, బట్టలు సహా అన్నీ దోచుకుని ఉడాయించారు. ప్యారిస్‌లో ఈ తరహా దాడులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతుండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అతి ఖరీదైన ప్రాంతంగానేకాక, అత్యంత లగ్జరియస్ షాపింగ్ కేంద్రంగా ప్యారిస్ వర్దిల్లుతోంది. ఆ కారణంగా దోపిడీలు కూడా భారీ స్థాయిలోనే జరుగుతున్నాయిక్కడ. ప్రభుత్వానికి ఈ దొంగతనాలు సవాల్‌గా మారుతున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్‌కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం









