12 మంది ఉగ్రవాదుల హతం

- November 23, 2016 , by Maagulf
12 మంది ఉగ్రవాదుల హతం

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులకు గట్టి ఎందురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో బుధవారం 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది.

ఆఫ్గన్ ఆర్మీ, పోలీసులు, పర్సనల్‌ ఇంటలిజెన్స్ ఏజెన్సీ సంయుక్తంగా 24 గంటల వ్యవధిలో ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 23 మంది ఉగ్రవాదులు గాయపడ్డారని వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. మృతి చెందిన 12 మంది ఉగ్రవాదుల్లో 8 మంది హెల్మండ్‌ ప్రావిన్సులోని లష్కర్‌ ఘా పట్టణం శివార్లలో నిర్వహించిన ఆపరేషన్ లో మృతి చెందినట్లు తెలుస్తోంది.ఇటీవలి కాలంలో తాలిబాన్‌ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆఫ్గన్‌ సైన్యం చర్యలు ముమ్మరం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com