మొక్కజొన్న హల్వా
- November 23, 2016
కావలసిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గుజ్జు - 1 కేజీ, (కండె నుండి వొలిచిన గింజల్ని ఉడికించి మిక్సీలో వేసుకోవాలి), పాలు - 1 లీటరు, కోవా - 200 గ్రా, పంచదార - 2 కప్పులు, నెయ్యి - 2 టీ స్పూన్లు, జీడిపప్పు, బాదం, కిస్మిస్ల పలుకులు అరకప్పు, యాలకుల పొడి - అరకప్పు
తయారుచేసే విధానం: దళసరిగా ఉన్న పాత్రలో పాలతో పాటే మొక్కజొన్న గుజ్జు వేసి, పాలు ఇగిరిపోయే దాకా మరిగించాలి. అడుగంటకుండా కలుపుతుండాలి. పంచదారను కలిపి, యాలకుల పొడి వేసి 7 నిమిషాల పాటు పంచదార కరిగేదాకా గరిటతో తిప్పుతూ ఉండాలి. నెయ్యి, కోవా వేసి సన్నని సెగపైన నెయ్యి పైకి తేలేదాకా ఉంచి దించాలి. తయారైన హల్వాపైన నెయ్యిలో వేగించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్లతో అలంకరిస్తే చూడ్డానికి బాగుంటుంది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







