ఇరాక్ లో ఆత్మహుతి దాడి 70 మంది భక్తులు మృతి
- November 24, 2016
బాంబు పేలుడుతో ఇరాక్ మరోమారు దద్దరిల్లింది. ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. ఈ దాడితో ఇరాక్ రక్తసిక్తమైంది. ఈ ఘటనలో 70 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతి చెందిన వారందరూ షియా భక్తులే. పవిత్ర షియా నగరం కర్బాలా నుంచి వస్తుండగా ఉగ్రవాది ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. దాడిలో కనీసం 70 మంది మృతి చెంది ఉండొచ్చని భద్రతాధికారి ఒకరు తెలిపారు. మృతి చెందిన వారిలో పది మంది ఇరాకీలు కాగా మిగిలినవారు ఇరానియన్లని పేర్కొన్నారు. ఈ పేలుడుపై ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







