టీ అమ్మకం ద్వారా గౌరవంగా జీవిస్తున్న ఓ సౌదీ తల్లి
- November 25, 2016
ఒక సౌదీ మహిళ నిరుద్యోగపు సంకెళ్ళు చేధించింది. వీధి లో టీ అమ్మడం ద్వారా ఆమె ఒక మర్యాదకర ఆదాయం పొందుతున్నట్లు ధ్రువీకరించింది. జుమన మక్కి అనే మహిళ మాదినహ్ లోని కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్ పై, టీ విక్రయిస్తూ తన వ్యాపారాన్ని ప్రారంభించింది. దీనితో ఆమె జీవన పరిస్థితులు అసాధారణ రీతిలో మెరుగైనట్లు పేర్కొంటుంది. టీ మరియు కొన్ని రకాల ఘుమ ఘుమలాడే కాఫీను సాధారణ వంటచెరకు మీద జుమన మక్కి తయారుచేస్తుంది.ఆమెకు విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇరువురు కుమార్తెలు సహాయం చేయడం విశేషం. జీవన పరిస్థితులు ఎలా మెరుగుపర్చుకోవాలో తన కుమార్తెలతో మాట్లాడడం జరిగిందని ముఖ్యంగా కుటుంబంలో పెరుగుతున్న ఖర్చులు మరియు ఒక కార్యాలయంలో ఉద్యోగం వెతుక్కోవడం ఎంత కష్టమైనదో గ్రహించినట్లు అయితే తన కుమార్తెల ఆలోచన ఫలితమే ఈ ఆలోచన విస్తరించిందని ఆమె " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధితో చెప్పారు.తాను పూర్తి విశ్వాసంతో మరియు ఏ సంకోచం లేకుండా టీ అమ్మాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. టీ విక్రయించే వ్యాపార నిర్వహణ ద్వారా విశ్వవిద్యాలయంలో చదువుతున్న నా కుమార్తెలకు తగిన సహాయం అందుతుందని చెబుతూ, "నేను రహదారి వెంబడి టీ మరియు కాఫీ అమ్మకం ప్రారంభించాను. ఇది చవకగా మరియు ఒక పెద్ద పెట్టుబడి అవసరం లేని ఓ చిరు వ్యాపారం అని ఎందుకంటే నేను వంటచెరకు వాటిని తయారుచేస్తాను. వాటి మీద మీద పెద్దగా డబ్బులు ఖర్చు చేయకుండా టీ తయారుచేస్తున్నట్లు ఆమె చెప్పారు.నేను ఈ విధంగా టీ అమ్మడంలో ఎటువంటి తప్పు లేదని అనుకొంటున్నాను. ఈ వ్యాపారంలో ఎంతో గౌరవంగా డబ్బు సంపాదిస్తున్నాను. ఈ సంపాదనతో మర్యాదగా జీవించడానికి నాకు వీలు కల్గుతుందని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ పై కొత్త చట్టం..
- గల్ఫ్ దేశాల పై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం
- మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!









