'పింక్‌' చిత్రానికి మరో అరుదైన గుర్తింపు ...

- November 26, 2016 , by Maagulf
'పింక్‌' చిత్రానికి మరో అరుదైన గుర్తింపు ...

 మహిళలపై లైంగిక వేధింపులు, ఆధునిక మహిళల పట్ల సమాజం చూపుతున్న ధోరణిని ప్రశ్నిస్తూ రూపొంది, విమర్శకుల ప్రశంసలందుకున్న 'పింక్‌' చిత్రానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్‌ 16న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. బిగ్‌ బి అమితాబ్‌ చిత్ర కథానాయిక తరఫున వాదించే న్యాయవాది పాత్రను పోషించారు.తాప్సీ, ఆండ్రియా తరియంగ్‌, కీర్తి కుల్హర్‌లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుద్ధరాయ్‌ చౌధురి దర్శకత్వం వహించగా రష్మిశర్మ, శూజిత్‌ సర్కార్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com